Jathi Ratnalu Movie MP3 Songs – Chitti, Mana Jathi Ratnalu, Chanchalguda Jail Lo

0

Jathi Ratnalu Movie MP3 Songs

Listen and Download Jathi Ratnalu Movie MP3 Songs

Jathi Ratnalu is a comedy movie written and directed by Anudeep KV. The movie actors Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna, Faria Abdullah, Murali Sharma, Brahmanandam, and Naresh. This movie is Produced by Nag Ashwin under Swapna Cinema. The movie is Released on 11 March 2021. The movie music is composed by Radhan. Below in this article, you can get Jathi Ratnalu Movie MP3 Songs.

1.Chitti Song Lyrics

Chitti Song Lyrics are penned by Ramajogayya Sastry from Jathi Ratnalu movie. The  music  compoed by Radhan and the song was sung by Ram Miriyala.  The movie starring Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna and Faria Abdullah.

చిట్టి నీ నవ్వంటే… లక్ష్మి పటాసే
ఫట్టుమని పేలిందా… నా గుండె ఖల్లాసే
అట్ట నువ్ గిర్రా గిర్రా… మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్టయ్యావని… సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే

వచ్చేశావే లైనులోకి… వచ్చేశావే
చిమ్మ చీకటికున్న జిందగిలోన… ఫ్లడ్ లైటేసావే
హత్తెరీ నచ్చేసావే… మస్తుగా నచ్చేసావే
బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని… లోకంలోన రంగులు పూసావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి… చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి… ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి… చిట్టీ, నా రెడ్ బుల్ చిట్టి
నా పేస్ బుక్కులో… లక్ష లైకులు కొట్టావే

యుద్ధమేమి జరగలే… సుమోలేవి అస్సలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో… పచ్చజెండ చూపించినావే
మేడం ఎలిజబెత్తు… నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని… ఆవారా నేనే అయినా
మాసుగాడి మనసుకే ఓటేసావే… బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటేసావే
తీన్ మార్ చిన్నోడిని… డీజే స్టెప్పులు ఆడిస్తివే
నసీబు బ్యాడు ఉన్నోన్ని… నవాబు చేసేస్తివే
అతిలోక సుందరివి నువ్వు… ఆఫ్ట్రాల్ ఓ టప్పోరి నేను
గూగుల్ మ్యాప్ అయి… నీ గుండెకు చేరిస్తివే

అరెరే ఇచ్చేసావే… దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చిబజ్జి లాంటి లైఫుల… నువ్వు ఆనియన్ ఏసావే
అరెరే గిచ్చేసావే… లవ్వు టాటూ గుచ్చేసావే
మస్తు మస్తు బిర్యానీలో… నింబూ చెక్కై హల్చల్ చేశావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి… చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి… ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి… చిట్టీ, నా రెడ్ బుల్ చిట్టి
నా పేస్ బుక్కులో… లక్ష లైకులు కొట్టావే

2. Mana Jathi Ratnalu Song Lyrics

Mana Jathi Ratnalu Song was sung by  Rahul Sipligunj.  The movie The song lyrics are penned by Kasarla Shyam and music is given by Radhan and from Jathi Ratnalu movie.

సూ… సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు… వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు… లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే… ఇంకో వందేళ్ళు
శాటిలైట్ కైనా చిక్కరు… వీళ్లో గల్లీ రాకెట్లు
డైలీ బిళ్ళగేట్స్ కి మొక్కే వీళ్ళై చిల్లుల పాకెట్లు
సుద్దాపూసలు సొంటే మాటలు… తిండికి తిమ్మ రాజులు
పంటే లేవరు లేస్తే ఆగరు… పనికి పోతరాజుల

సూ… సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు… వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు… లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే… ఇంకో వందేళ్ళు

వీళ్ళతోటి పోల్చామంటే… ధర్నా చేస్తై కోతులు
వీళ్ళుగాని జపం చేస్తే… దూకి చస్తై కొంగలు
ఊరిమీద పడ్డారంటే… ఉరేసుకుంటై వాచీలు
వీళ్ళ కండ్లు పడ్డయంటే… మిగిలేదింకా గోచీలు
పాకిస్థానుకైనా పోతరు… ఫ్రీ వైఫై చూపిస్తే
బంగ్లాదేశ్ కైనా వస్తరు… బాటిల్ నే ఇప్పిస్తే

సూ… సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు… వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు… లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే… ఇంకో వందేళ్ళు

వీళ్ళు రాసిన సప్లిమెంట్లతో… అచ్చెయ్యొచ్చు పుస్తకం
వీళ్ళ కథలు జెప్పుకొని… గడిపేయొచ్చు ఓ శకం
గిల్లి మరీ లొల్లి పెట్టే సంటి పిల్లలు అచ్చము
పిల్లి వీళ్ళ జోలికి రాదు… ఎయ్యరు గనక బిచ్చము
ఇజ్జత్కి సవాలంటే… ఇంటి గడప తొక్కరు
బుద్ధి గడ్డి తిన్నారంటే… దొడ్డి దారి ఇడవరు

భోళా..! హరిలోరంగ ఆ మొఖం… పంగనామాలు వాలకం
మూడే పాత్రలతో రోజు వీధి నాటకం
శంభో లింగ ఈ త్రికం… గప్పాలు అర్రాచకం
బాబో..! ఎవనికి మూడుతుందో… ఎట్టా ఉందో జాతకం

3.Chanchalguda Jail Lo Song Lyrics

Chanchalguda Jail Lo Song Lyrics penned by Kasarla Shyam and music composed by Radhan. The song was by Yogi Sekar from the Jathi Ratnalu movie.  The movie stars  Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna and Faria Abdullah.

చంచల్ గూడ జైలులో… చిలకలయ్యి చిక్కారు
పలకమీదికెక్కిందయ్యో నెంబరు
సుక్కలందుకోని రెక్కలు విప్పి
తుర్రుమంటూ ఎగిరారు
వీళ్ళ గాచారమే గుంజి తంతే బొక్కలో పడ్డారు

ఏ నిమిషానికి ఏమి జరుగునో
పాటకు అర్థమే తెలిసొచ్చేనే
వెన్న తిన్న నోటితో… మన్ను బుక్కిస్తిరే
ఏమి గానున్నదో ఏందో రాత
రంగు రంగుల పాల పొంగులా
మస్తు మస్తు కలలు కంటే
సిట్టి గుండెకే చెప్పకుండనే ఆశ పుట్టెనే

నీళ్ళలో సల్లగా బతికేటి చేపనే ఒడ్డుకే ఏస్తిరే
యమ తోమ బడితిరే…
ఇంటినున్న పుల్ల తీసి… అటు పెట్టనోనికి
నెత్తి మీద బండ పెట్టి ఉరికిస్తుండ్రే
అరె మారాజు తీరే ఉన్నోన్ని… ఏ రందీ లేనోన్ని
బతుకాగం చెసిండ్రే… ఓ బొందల తోసిండ్రే

అరె బేటా..! మీరు ఏది పట్టినా…
అది సర్వనాశనం, ఇది దైవశాసనం
ఇంట్ల ఉన్నన్నినాళ్ళు… విలువ తెలువలేదురో
కర్మ కాలిపోయినంక కథే మారెరో
ఖైదీ బట్టలు, రౌడీ గ్యాంగులు…నాలుగు గోడలే నీ దోస్తులాయెరో
అవ్వ పాయెరో, బువ్వ పాయెరో… పోరి తోటి లవ్వే పాయే
ముద్దుగున్న మీ లైఫు అందమే పలిగి పాయెరో

4. Silly Fools Song Lyrics

Silly Fools Song Lyrics  from  Jathi Ratnalu movie. The song lyrics are penned by Anudeep KV & Wamce Goud. The music is composed by Radhan, and the song was sung by Purnima. This movie is written directed by  Anudeep KV.

ఓ మామ వాట్ హాపెండ్ రా రామా
వాట్స్ ఆల్ ధీజ్ సే డ్రామా
ఇది ఏమి హుంగామా
ఓ మామ వాట్ హాపెండ్ రా రామా
వాట్స్ ఆల్ ధీజ్ సే డ్రామా
ఇది ఏమి హుంగామా

అరె లైఫే ఒక జిందగీ కాబట్టి
తిన్నదరిగి పోబట్టే… కొమ్మ ఇరిగి పోవట్టే

సిల్లీ ఫూల్స్ ఆర్ ట్రయింగ్ టూ బ్రేక్ ద రూల్స్
అండ్ ఫైటింగ్ విత్ ధీజ్ గూడ్స్
అండ్ మౌంటెన్ ఆన్ దేయిర్ స్పూన్స్
రన్ రన్ రన్… రన్ అవే ఫ్రమ్ ద గన్
గో ఫైండ్ ఏ ప్లేస్ మై సన్
ఫ్రమ్ ద హెల్ అండ్ హెవెన్

సిల్లీ ఫూల్స్ ఆర్ ట్రయింగ్ టూ బ్రేక్ ద రూల్స్
అండ్ ఫైటింగ్ విత్ ధీజ్ గూడ్స్
అండ్ మౌంటెన్ ఆన్ దేయిర్ స్పూన్స్
రన్ రన్ రన్… రన్ అవే ఫ్రమ్ ద గన్
గో ఫైండ్ ఏ ప్లేస్ మై సన్
ఫ్రమ్ ద హెల్ అండ్ హెవెన్

తూతు తుతుతూ తూతు తుతుతూ
తూతు తుతుతూ తూతుతుతూ
తూతు తుతుతూ తూతు తుతుతూ
తూతు తుతుతూ తూతుతుతూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *