Love Story Movie Mp3 Songs – Listen and Download
Rewanth as Naga Chaitanya of Armor belonged to a lower caste. Maunika as Sai Pallavi of the same town belonged to the upper caste. Unable to tolerate discrimination Revanth goes to town and runs a dance school. In the Love Story movie, Maunika arrives in Hyderabad to escape trouble with her Babai Rajiv Kanakala. Rewanth and Maunika’s introduction that took place there last with love, but caste clans stand in the way of their marriage.
1. Ay Pilla Song Lyrics
The film starring Akkineni Naga Chaitanya and Sai Pallavi. The Love Story movie soothing music by Pawan Ch. Film’s Director Sekhar Kammula is known for picking the finest music from the music directors. The song is sung by Haricharan and lyrics by Chaithanya Pingali. It seems the film is going to be one of the best love story movies with great music.
ఏయ్ పిల్లా పరుగున పోదామా
ఏ వైపో జంటగ ఉందామా
రా రా కంచె దుంకి
చక చక ఉరుకుతు
ఆ రంగుల విల్లుని తీసి ఈ వైపు వంతెన వేసి రావా
ఎన్నో తలపులు ఏవో కలతలు బతుకే పొరవుతున్నా
గాల్లో పతంగిమల్లె ఎగిరే కలలే నావి
ఆశనిరాశల ఉయ్యాలాటలు పొద్దుమాపుల మధ్యే
నాకంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే
నీతో ఇలా ఏ బెరుకు లేకుండా
నివ్వే ఇగ నా బతుకు అంటున్నా
నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే తలగడగా
నీ తలను వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా మిలమిల చూడే
వచ్చే మలుపులు
రస్తా వెలుగులు జారే చినుకుల జల్లే
పడుగూ పేకా మల్లె
నిన్ను నన్ను అల్లే
పొద్దే తెలియక, గల్లీ పొడుగున
ఆడే పిల్లల హోరే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే
ఏయ్ పిల్లా పరుగున పోదామా
ఏ వైపో జంటగ ఉందామా
పారే నదై నా కలలు ఉన్నాయి
చేరే దరే ఓ వెదుకుతున్నాయే
నా గుండె ఓలి చేసి
ఆచి తూచి అందించా జాతరలా
ఆ క్షణము చాతి పైన సోలి చూశా లోకం మెరుపుల జాడే
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి
నేలన కనిపిస్తుందే
మారే నీడలు గీసే
తేలే బొమ్మలు చూడే
పట్నం చేరిన పాలపుంతలు
పల్లెల సంతలు బారే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే
2.Nee Chitram Choosi Song Lyrics
Nee Chitram Choosi Song Lyrics in Love Story Movie song is sung by Anurag Kulkarni. Nee Chitram Choosi Song Lyrics In Telugu Music of this song is composed by Pawan Ch and penned by Mittapalli Surender. Starring Naga Chaitanya, Sai Pallavi, Nee Chitram Choosi Telugu Song Lyrics.
నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో…
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో….
నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో…
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో…
నా ఇంటి ముందు… రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు… నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో…
ఈ దారిలోని గందరగోళాలే… మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో… మన పెళ్ళీ మంత్రాలుగా
అటు వైపు నీవు… నీ వైపు నేను
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా…
ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా…
నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటుంది ప్రేమా…
ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ…
ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తానని…
నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోని… ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని
ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది
మనకు ప్రేమా…
3. Saranga Dariya Song Lyrics
Saranga Dariya Song Lyrics in Love Story Movie song is sung by Anurag Kulkarni. The music of this song is composed by Pawan Ch and penned by Mittapalli Surender. Starring Naga Chaitanya, Sai Pallavi.
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
కాళ్ళకు ఎండీ గజ్జెల్ లేకున్నా
నడిస్తే ఘల్ ఘల్
కొప్పులో మల్లే దండల్ లేకున్నా
చెక్కిలి గిల్ గిల్
నవ్వుల లేవుర ముత్యాల్
అది నవ్వితే వస్తాయ్ మురిపాల్
నోట్లో సున్నం కాసుల్
లేకున్నా తమల పాకుల్
మునిపంటితో మునిపంటితో
మునిపంటితో నొక్కితే పెదవుల్
ఎర్రగా అయితదిర మన దిల్
చురియా చురియా చురియా
అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
రంగే లేని నా అంగీ
జడ తాకితే అయితది నల్లంగి
మాటల ఘాటు లవంగి
మర్లపడితే అది శివంగి
తీగలు లేని సారంగి
వాయించబోతే అది ఫిరంగి
గుడియా గుడియా గుడియా
అది చిక్కీ చిక్కని చిడియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని సెంపలు ఎన్నెల కురియా
దాని సెవులకు దుద్దులు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని నడుం ముడతలే మెరియా
పడిపోతది మొగోళ్ళ దునియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
4. Evo Evo Kalale Song Lyrics
Evo Evo Kalale Song Lyrics in Love Story movie song is sung by Anurag Kulkarni. The music of this song is composed by Pawan Ch and penned by Mittapalli Surender. Starring Naga Chaitanya, Sai Pallavi. Producers for this movie Sri Narayandas Narang, Sri P. Ram Mohan Rao.
ఏవో ఏవో కలలే… ఎన్నో ఎన్నో తెరలే
అన్ని దాటి మనసే… హే, ఎగిరిందే
నన్నే నేనే గెలిచే క్షణాలివే కనుకే
పాదాలకే అదుపే… హే హే, లేదందే
రమ్ పమ్ తర రమ్ పమ్
తర రమ్ పమ్… ఎదలో రమ్ పమ్
తర రమ్ పమ్… తర రమ్ పమ్ కథలో
ఏంటో..! కొత్త కొత్త రెక్కలొచ్చినట్టు
ఏంటో..! గగనంలో తిరిగా
ఏంటో..! కొత్త కొత్త ఊపిరందినట్టు
ఏంటో..! తమకంలో మునిగా
ఇన్నాళ్ళకి వచ్చింది విడుదల
గుండెసడి పాడింది కిలకిల
పూలాతడి మెరిసింది మిలమిల
కంటీతడి నవ్వింది గలగల
ఊహించలేదసలే ఊగిందిలే మనసే
పరాకులో ఇపుడే… హే హే పడుతోందే
అరే అరే అరెరే… ఇలా ఎలా జరిగే
సంతోషమే చినుకై దూకిందే
రమ్ పమ్ తర రమ్ పమ్
తర రమ్ పమ్… ఎదలో రమ్ పమ్
తర రమ్ పమ్… తర రమ్ పమ్ కథలో
ఏంటో..! కల్లల్లోన ప్రేమ ఉత్తరాలు
ఏంటో..! అసలెప్పుడు కనలే
ఏంటో..! గుండెచాటు ఇన్ని సిత్తరాలు
ఏంటో..! ఎదురెప్పుడు అవలే
నీతో ఇలా ఒక్కొక్క ఋతువుని దాచెయ్యన
ఒక్కొక్క వరమని
నీతో ఇలా ఒక్కొక్క వరముని పోగెయ్యనా
ఒక్కొక్క గురుతుని
ఇటువైపో అటువైపో ఎటువైపో… మనకే తెలియని వైపు
కాసేపు విహరిద్దాం చల్ రే… హో హో
ఏంటో మౌనమంత మూత విప్పినట్టు
ఏంటో సరిగమలే పాడే
ఏంటో వానవిల్లు గజ్జకట్టినట్టు
ఏంటో కథకళినే ఆడే
గాల్లోకిలా విసరాలి గొడుగులు
మన స్వేచ్ఛకి వెయ్యొద్దు తొడుగులు
సరిహద్దులే దాటాలి అడుగులు
మన జోరుకి అదరాలి పిడుగులు
ఏంటో హల్లిబిల్లి హాయి మంతనాలు
ఏంటో మన మధ్యన జరిగే
ఏంటో చిన్న చిన్న చిలిపి తందనాలు
ఏంటో వెయ్యింతలు పెరిగే
ఏంటో ఆశలన్నీ పూసగుచ్చడాలు
ఏంటో ముందెప్పుడు లేదే
ఏంటో ధ్యాస కూడా దారి తప్పడాలు
ఏంటో గమ్మత్తుగా ఉండే
5. Winner Winner Bro Song Lyrics
This Song was Composed by Pawan Ch Song sung by Abhijith Rao and Winner Winner Bro Lyrics Written by Roll Rida. Starring Naga Chaitanya, Sai Pallavi. Producers for Love Story movie Sri Narayandas Narang, Sri P. Ram Mohan Rao.
విన్నర్ విన్నర్ బ్రో
చికెన్ డిన్నర్ బ్రో
డ్యాన్సర్ డ్యాన్సర్ బ్రో
మేక్ దేమ్ కిల్లర్ బ్రో
నో బ్రదర్ బ్రో నీ చాతి కొంచె ఎత్తు బ్రదర్
బ్రో బ్రో బ్రో నీ యాటిట్యూడ్ సెట్ బ్రో
బ్రో బ్రో బ్రో మా అమ్మ తోడు అడ్దుకో
బ్రో బ్రో బ్రో నీ కన్నా చాలా ఎత్తు బ్రదర్
జీరోకెల్లి వచ్చినము బ్రో లైఫ్‌లోనా
హీరోలా గ్రో అయితాము ఫ్యూచర్ అంతా
క్యుని ఫాలో కాలేము మంధాలాగ
హై లో తేలుతుంటాము ఎన్ని అన్నా
విన్నర్ విన్నర్ బ్రో
చికెన్ డిన్నర్ బ్రో
డ్యాన్సర్ డ్యాన్సర్ బ్రో
మేక్ దేమ్ కిల్లర్ బ్రో
ఆగమ్ పరేశంలో ఉంటే
జిందగీ మొత్తం పాపడేద్దాం
కుల్లం కుల్లగా ఉందాం
ఎవ్వడేం అంటాడో చూసుకుందాం
పైసల్ కమయితం కష్టాలన్ని కలబడతం
దమ్కి ఇచ్చెదాం ఇది మా అయ్య జాగిరి అంటే ఉందాం
దునియాని దున్నీ పడేస్తాం
మీరన్న మాట కొట్టి పడేస్తాం
దునియాని దున్నీ పాడేస్తాం
మీ నోళ్లకి తాళం వేపిస్తాం
జీరోకెల్లి వచ్చినము బ్రో లైఫ్‌లోనా
హీరోలా గ్రో అయితాము ఫ్యూచర్ అంతా
క్యుని ఫాలో కాలేము మంధాలాగ
హై లో తేలుతుంటాము ఎన్ని అన్నా
వెనకాల ఎన్ని మాటలు అన్నా
వెనకే ఉండిపోతారు చిన్నా
సాధిస్తారు గొంతరిగేదాకా
సాధించాలి గొంతెండేదాకా
ఎవరెమన్న డేకొద్దు లేలే
సౌండే పెంచీ పగలాలి గౌబే
విన్నర్ విన్నర్ బ్రో
చికెన్ డిన్నర్ బ్రో
డ్యాన్సర్ డ్యాన్సర్ బ్రో
మేక్ దేమ్ కిల్లర్ బ్రో
జీరోకెల్లి వచ్చినము బ్రో లైఫ్‌లోనా
హీరోలా గ్రో అయితాము ఫ్యూచర్ అంతా
క్యుని ఫాలో కాలేము మంధాలాగ
హై లో తేలుతుంటాము ఎన్ని అన్నా
జీరోకెల్లి వచ్చినము బ్రో లైఫ్‌లోనా
హీరోలా గ్రో అయితాము ఫ్యూచర్ అంతా
క్యుని ఫాలో కాలేము మంధాలాగ
హై లో తేలుతుంటాము ఎన్ని అన్నా
Also Read: Malli Malli Idi Rani Roju Movie Mp3 Songs – Listen and Download