Narappa Movie Mp3 Songs – Listen and Download

0

Narappa Movie Mp3 Songs

Naarappa is an action thriller movie directed by Srikanth Addala and jointly produced by Suresh Babu and Kalaipuli S. Dhanu. The movie cast includes Venkatesh and Priyamani are played the main lead roles while Mani Sharma scored the music. Naarappa is an official remake of the Tamil blockbuster movie Asuran

1.Chalaaki Chinnammi Song Lyrics In Telugu

Chalaaki Chinnammi song lyrics in Telugu from Narappa movie. This song’s lyrics are written by Anantha Sriram. Music was given by Mani Sharma and this song is sung by the singers Aditya Iyengar, Nutana Mohan. Venkatesh, Priyamani plays lead roles in this movie. Narappa movie is directed by Srikanth Addala under the banner V creations, Suresh Productions.

తందానే నానేనేనా నానా
తందానే నానేనేనా నానా
తందానే నానేనేనా నానా
తందానే నానేనేనా నానా
చిలిపి చూపుల చలాకి చిన్నమ్మి చలాకి చిన్నమ్మి
ఎలాగే నిన్నిడిచి ఏలాగే ఉండేది చలాకి చిన్నమ్మి
రాగి ముద్దవే నువ్వేరానీ కారము
నేనెలాగే నిన్నిడిచి ఎలాగే ఉండేది చలాకి చిన్నమ్మి
రానా నీతోటి ఇలాగె నిను నమ్మి ఇలాగె నిను నమ్మి
రాల సీమింటి ఒయారే వన్నెల్లో
వరాలే విరజిమ్మి వరాలే విరజిమ్మి

కిందాలెన్నైనా చెస్థానే నీతో
ఉండే నూరేళ్లు చూడాలే ఎంతో
రేగడి నేనైతే నాగలి నీ నవ్వే
దున్నితే పండాలె నా పంట
మంచే కట్టాలోయ్ ఈడు పోలంలో
కంచె తెంచాలోయ్ కన్నె కలల్లో
అంచే చేరాలోయ్ కొక చివర్లో
కంచై మోగాలోయ్ రైక కోనల్లో
యాలో యాల కంటెలై కాయాలా
క్షణాలే ఈ వెళా
నువ్వు నేన్ తొయ్యలా జతై మోసేయ్యలా

కంది చేలోనా జోరీగల్లాగా
జోడై ఎగిరేద్దాం రాయే సరదాగా
వేమన అవతారం ఎన్నడే బంగారం
అన్నది నా ఆత్రం భారంగా
చాల్లే చాలబ్బి సంబడమిట్టా
లగ్గా లేకుండా సందడులెట్టా
నీకై దాచానే పల్లము మిట్టా
నువ్వే దాటెయ్ నా సిగ్గుల కట్టా
పిల్లగాలే పిచ్చిగా ఉగాలే
పీ పీ పీ డుండుంలే
పీ పీ పీ డుండుంలే
పీ పీ పీ డుండుంలే

2.Ooo Narappa Song Lyrics in Telugu

Ooo Narappa lyrics in Telugu from Narappa movie. This song’s lyrics are written by Anantha Sriram. Music was giveMani Sharma and this song is sung by the singer Dhanunjay, Varam. Venkatesh, Priyamani plays lead roles in this movie. Narappa movie is directed by Srikanth Addala under the banner Suresh Productions, V Creations.

ఓ… నారప్ప
నువ్వంటే ఇట్టంగుందే నారప్ప
నిను చూడంగానే ఇపారిందోయ్ నా రెప్ప
ఓ… కన్నమ్మ
ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ
నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ

ఇనేయ్ వా ఇట్టా ఇట్టా
నా గుండె ఏమంటుంటదో
ఇన్నాలే ఆశల చిట్టా
ఆ ఎరుకే ఎం అవుతుండదో
భలేగా బాగుందే సిలకా నీ మాయ
తలకాయ్ ఆడించే పిలకాయ్ అయిపోయా
కలకే నోరూరే ఎలుగె మనపై
పడుతుండాదే హోయా

ఓ… నారప్ప
నువ్వంటే ఇట్టంగుందే నారప్ప
నిను చూడంగానే ఇపారిందోయ్ నా రెప్ప
ఓ… కన్నమ్మ
ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ
నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ

బళ్లారి సంతకెళ్లి ఓ బాసేడు పల్లీలు తేనా
పల్లీలు నువు తెస్తే మావ
నా ప్రాణాలే బదులిచ్చేయనా
కదిరి గుళ్ళోకి కలిసి పోదామా
మడక సిరలోన మనువాడేద్దామా
సెరువు కాన్నుంచి సక్కని గుడిసె మనమేసుకున్దామా

ఓ… నారప్ప
నువ్వంటే ఇట్టంగుందే నారప్ప
నిను చూడంగానే ఇపారిందోయ్ నా రెప్ప
ఓ… కన్నమ్మ
ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ
నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ

3.Raa Narakara Theme Song Lyrics in Telugu

Rage Of Narappa lyrics from the Narappa movie. The song is sung by Revanth, Sai Charan, Sri Krishna, Lyrics are Written by Anantha Sriram and the Music was composed by Mani Sharma. Starring Venkatesh, Priyamani.

రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర
చేరగరా మెడని మెడని విడిగా
రా తరమరా తురమరా
నరము నరము విరగ

కత్తి గొంతులో… నెత్తురేయ్యారా
మట్టి నోటిలో… దండ ముద్ద కలిపి వెయ్యరా
నీలి నింగిని… గాలి రంగుని
యెర్ర ఎర్రగా… మార్చి వెయ్యరా
ఆయుధానికే ఆయుధానివై
ఆయువుల్ని తీసి చేసుకోరా… చావు జాతర

రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర
చేరగరా మెడని మెడని విడిగా
రా తరమరా తురమరా
నరము ​నరము విరగ

గుండెలోకి గుణపమై
కడుపులోకి కొడవలి
దూసుకెళ్లి కోసుకెళ్లి
పేగులన్నీ తొలిచివేయ్
గాయపడ్డ మనసువై
మోసపడ్డ మనిషివై
లోపలున్న రాక్షసుణ్ణి
దాచకింకా పైకి తీయి
క్రూర మృగమువై… క్రూర మృగమువై
గొర్ల కోరలతో
వాళ్ళ రొమ్ములని వొలిచివేయ్
కల యముడివై… పూనకాల యముడివై
పాశం విసిరివేయ్
వెన్ను పూసలన్నీ విరిచివేయ్

రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర
చేరగరా మెడని మెడని విడిగా
రా తరమరా తురమరా
నరము ​నరము విరగ

వేటు వేస్తే నలుగురు
పోటువేస్తే పదుగురు
వేట నీకు కొత్తకాదు
వీళ్ళు ఎవరు మిగలరు
రగులుతున్న క్షణములో
సెగల కళ్ల వెలుతురు
తగలబెడుతూ ఉంటే వాళ్ళు
వెనక ముందు మిగలరు
కోరి సమరమో కోరకుండా సమరమో
ఎంత సమయమో… ముగియడానికి ఎంత సమయమో
కోరి మరణమో కోరకుండా మరణమో
ఏది మరణమో… తీర్చడానికి ఏది తారుణమో

రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర
చేరగరా మెడని మెడని విడిగా
రా తరమరా తురమరా
నరము ​నరము విరగ

4. Thalli Pegu Song Lyrics In Telugu

This song lyrics are written by Sirivennela Seetharama Sastry. Music is given by the Manisharma and this song is sung by the singer Saondhavi.  The song Music is labelled by Suresh Productions. Venkatesh, Priyamani plays lead roles in this movie. Narappa movie is directed by Srikanth Addala under the banner V creations, Suresh Productions.

తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా, ఆ ఆ
నన్ను కన్న తండ్రి… ఇలా రావయ్యా
కడుపులోనే ఉండక… ఈ పుడమికెలా వస్తివయ్యా
సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా, ఆఆ
ఇంతలోనే ఏమయ్యావో సెప్పయ్యా

రాకాసి చీకటిలో… ఏ కీడు తాకిందో
ఏకాకివై పోయావా చంద్రయ్యా
కళ్ళేర్రా చేసి రేయిని చూడయ్యా, ఆఆ
తెల్లారి సూరిడల్లే రావయ్యా

నీ సెమట తడి ఇంకా ఇంకనేలేదయ్యా
ఈ తోటనంతా తడిమి సూడయ్యా
నీ నవ్వు సడి లేక… గూడు సిన్నబోయెనయ్యా
ఇంతలోనే ఋణము తీరే నీకయ్యా, ఆఆ
మట్టిని చీల్చుకొచ్చే… విత్తనమై రావయ్యా
సావుని కూడా సంపే… సత్తువ నీదయ్యా, ఆ ఆ
అష్టదిక్కులన్నీ సుట్టుముడుతున్నా, ఆ ఆ
ఇట్టేనెట్టి సప్పునా ఇంటికి రావయ్యా

తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా, ఆ ఆ
నన్ను కన్న తండ్రి… ఇలా రావయ్యా

కన్నొదిలి చూపెల్లీ మసకేసి పోయేలే
గుండెల్లో మంట నిన్ను చూపేనా, ఆ
నన్నొదిలి నువ్వెళ్ళి… కోడి కట్టి ప్రాణాలే
నా ఆశకాయువింకా… ఇంకా మిగేలేరా
కటిక నిజం నీదని… ఏ రుజువెదురవని
నమ్మాలంటే కష్టం కదా నాయనా
ఆకైనా అల్లాడదే చూడయ్యా, ఆ
నువు రాకుంటే గాలాడదే కన్నయ్యా

తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా, ఆ ఆ
నన్ను కన్న తండ్రి… ఇలా రావయ్యా
కడుపులోనే ఉండక… ఈ పుడమికెలా వస్తివయ్యా
సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా, ఆఆ
ఇంతలోనే ఏమయ్యావో సెప్పయ్యా

రాకాసి చీకటిలో… ఏ కీడు తాకిందో
ఏకాకివై పోయావా చంద్రయ్యా, ఆ ఆ
కళ్ళేర్రా చేసి రేయిని చూడయ్యా, ఆఆ
తెల్లారి సూరిడల్లే రావయ్య

Uru Nattadiye Song Lyrics In Telugu

Ooru Natta Song Lyrics penned by Sirivennela Seetharama Sastry, music composed by Mani Sharma, and sung by Anurag Kulkarni from period action movie Narappa.

ఊరు నట్టనడివాయే
దారి కంట పడదాయే
నీ జాడ చెప్పేదెవరు నాకింకా, ఆ ఆ
నిన్ను చూడగలనో లేదో నేనింకా

వేళ చూడు వేటాయే
వెలుగు కూడా ఇటాయే
ఓపలేని బరువైపోయే బాణాలు, ఊఉ
ఆపలేని పరుగైపోయే పాదాలు

Also Read: Paagal Movie Mp3 Songs – Watch and Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *