Rangamarthanda Movie Mp3 Songs Lyrics, Video Songs, Songs Info

0

Rangamarthanda Movie Mp3 Songs

Nannu Nannuga Song Lyrics

Nannu Nannuga Song Lyrics penned by Sirivennela Seetharama Sastry, music composed by Ilayaraja, and sung by Gayatri from Telugu cinema ‘Rangamarthanda‘.

నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటు నిందలేవి వెయ్యలేనుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా

లోలో ఏదో వెచ్చనైన వేడుక
సిచ్చో అన్నా చల్లబడదే
నిన్ను అంతే ముచ్చటైన కోరిక
ముంచేస్తుంటే మంచిదన్నదే
దారే దరే లేని ఆశ

నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటు నిందలేవి వెయ్యలేనుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా ఆ ఆఆ

మనసు నను ఎన్నడో విడిచిపోయిందనీ
ఎగసి నీ గుండెలో వలస వాలిందనీ
తెలిసి తెలిసి సయ్యన్నానో
తెలియదేమో అనుకున్నానో
తగని చొరవ కద అన్నానో
తగిన తరుణమనుకున్నానో
తలపు నిన్నొదిలి మరలిరాదే
దరిమిలా మనకిలా కలహమేలా

నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటు నిందలేని వెయ్యలేనుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా

కంటి ఎరుపేమిటో
కొంటె కబురన్నదీ
ఒంటి మెరుపేమిటో
కంది పోతున్నదీ

చిగురు పెదవులను నీ పేరు
చిదిమి చిలిపి పాటేస్తుంటే
బిడియపడకు అని నీ వేలు
అదును తెలిసి మీటుతు ఉంటే
ఉలికిపడి లేచి కలికి ఊహ
తడబడే పరుగులు త్వరపడాల

సా దనిసగ సని దనిసా నీ మదనిస నిగ మదని దా గమదని దమగమ దా సగమ గమదని దనిసగ సగా గ నీని సా సా దా దా నీ ని మా మ సాగమాద నీని సా స దనిస మదని గమద నీని మదని గమద సగమ గని మద గమ సగనిస గని సగమ దనిస నా మగరిస రిగరిస నిదనిస నిద నిదనిస నిగమగదసని తని దసని నిగమగమదని

నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటు నిందలేని వెయ్యలేనుగా
నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా

Nenoka Natudni Lyrics

నేనొక నటుడ్ని..!
చంకీల బట్టలేసుకొని, అట్టకిరీటం పెట్టుకొని
చెక్క కత్తి పట్టుకుని, కాగితాల పూల వర్షంలో
కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను
కాలాన్ని బంధించి… శాసించే నియంతని నేను

నేనొక నటుడ్ని..!
నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని
నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని
వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని
వేషం తీస్తే ఎవ్వరికీ కాని జీవుడ్ని…

నేనొక నటుడ్ని..!
నవ్విస్తాను, ఏడిపిస్తాను…
ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను.
హరివిల్లుకు ఇంకో రెండు రంగులు వేసి నవరసాలు మీకిస్తాను.
నేను మాత్రం, నలుపు తెలుపుల
గందరగోళంలో బ్రతుకుతుంటాను…

నేనొక నటుడ్ని..!
జగానికి జన్మిస్తాను
సగానికి జీవిస్తాను
యుగాలకి మరణిస్తాను
పోయినా బ్రతికుంటాను…

నేనొక నటుడ్ని..!
లేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాడ్ని
ఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్ని
ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని
అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని…

నేనొక నటుడ్ని..!
గతానికి వారధి నేను
వర్తమాన సారధి నేను
రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను
పూట పూటకి రూపం మార్చుకునే
అరుదైన జీవిని నేను.

నేనొక నటుడ్ని..!
పిడుగుల కంఠాన్ని నేను
అడుగుల సింహాన్ని నేను.
నరంనరం నాట్యం ఆడే… నటరాజ రూపాన్ని నేను
ప్రపంచ రంగస్థలంలో… పిడికెడు మట్టిని నేను
ప్రఛండంగా ప్రకాశించు రంగమార్తాండున్ని నేను.

నేనొక నటుడ్ని..!
అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుడ్ని
కానీ, తొమ్మిది తలలు ఉన్న నటరాణుడ్ని
నింగీనేల రెండడుగులైతే
మూడో పాదం మీ మనసులపై మోపే వామనుడ్ని
మీ అంచనాలు దాటే ఆజానుబాహున్ని
సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని…

నేనొక నటుడ్ని..!
అప్సరసల ఇంద్రుడ్ని
అందుబాటు చంద్రుడ్ని
అభిమానుల దాసుడ్ని
అందరికీ ఆప్తుడ్ని
చప్పట్లను భోంచేస్తూ
ఈలలను శ్వాసిస్తూ
అణుక్షణం జీవించే
అల్ప సంతోషిని నేను

మహా అదృష్టవంతుడిని నేను
తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే
సగటు కళాకారుడ్ని నేను.
ఆఖరి శ్వాస వరకు నటనే ఆశ నాకు.
నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు శతకోటి నమస్సులు మీకు

Also, read: Phalana Abbayi Phalana Ammayi Movie Mp3 Songs Lyrics, Video Songs, Songs Info

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *