Listen or Download Sathamanam Bhavati MP3 Songs
Sathamanam Bhavati movie written and directed by Satish Vegesna and produced by Dil Raju under Sri Venkateswara Creations. The movie stars Sharwanand, Anupama Parameswaran, Prakash Raj and Jayasudha , Naresh, Indraja, Raja Ravindra, Shiju, Himaja, and Sithara. The music is composed by Mickey J. Meyer. Below in this article, you can find the Sathamanam Bhavati MP3 Songs listen and download.
1. Mellaga Tellarindoi Song Lyrics
Mellaga Tellarindoi Song Lyrics in Sathamanam Bhavati movie. Music Composed by Mickey J Meyer. This Movie Stars are Shrwanand and Anupama Parameshweran.This Song Lyrics Penned by Srimani.
మెల్లగా తెల్లారిందోయ్ అలా… వెలుతురే తెచ్చేసిందో ఇలా
బోసినవ్వులతో మెరిసే పసిపాపల్లా…
చేదతో బావులలో గలగల… చెరువులో బాతుల ఈతల కళ
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళా…
చుట్ట పొగమంచుల్లో… చుట్టాల పిలుపుల్లో
మాటలే కలిపేస్తూ మనసారా…
మమతల్ని పండించి అందించు హృదయంలా…
చలిమంటలు ఆరేలా… గుడిగంటలు మోగేలా…
సుప్రభాతాలే వినవేలా… ఆ ఆ
గువ్వలు వచ్చే వేళ… నవ్వులు తెచ్చే వేళ…
స్వాగతాలవిగో కనవేలా… ఆ ఆ
పొలమారే పొలమంతా… ఎన్నాల్లో నువ్వు తలచి
కళ మారే ఊరంతా… ఎన్నేళ్లో నువ్వు విడచి…
మొదట అందని దేవుడి గంట… మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహతహలాడిన… పసితనమే గురుతొస్తుందా…
ఇంతకన్నా..ఆ ఆ… తియ్యనైన…ఆ ఆ… జ్ఞాపకాలే…
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన…
నువ్వూగిన ఉయ్యాల… ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనబడకా…ఆ ఆ
నువ్వాడిన దొంగాట… బెంగల్లే మిగలాలా
నన్నెవరూ వెతికే వీల్లేకా…ఆ ఆ
కన్నులకే..ఏ ఏ.. తియ్యదనం… రుచి చూపే..ఏ ఏ.. చిత్రాలే…ఏ ఏ
సవ్వడితో… ఓ ఓ.. సంగీతం…ఓ ఓ.. పలికించే సెలయేళ్లే… ఏ ఏ
పూలచెట్టుకి ఉందో భాష… అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్ళే లేరే… అందం మాటాడే భాష…
పలకరింపే.. ఏ ఏ… పులకరింపై.. ఏ ఏ పిలుపునిస్తే… ఏ ఏ
పరవశించడమే మనసుకి తెలిసిన భాష…
మమతలు పంచే ఊరు… ఏమిటి దానికి పేరు…
పల్లెటూరేగా ఇంకెవరూ… ఊఉ
ప్రేమలు పుట్టిన ఊరు… అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరూ… ఊఉ
2. Nilavade Madi Nilavade Song Lyrics
Nilavade Madi Nilavade Song Lyrics penned by Ramajogayya Sastry Garu, music composed by Mickey J Meyer Garu and sung by S P Balasubramanyam Garu from the Telugu movie Shatamanam Bhavati movie.
నిలవదే మది నిలవదే… సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే… తొలివలపున తడిసి
దేవదాసే కాళిదాసై… ఎంత పొగిడిన
కొంత మిగిలిపొయేంత… అందం నీది
నిలవదే మది నిలవదే… సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే… తొలివలపున తడిసి
అలా నువ్వు చూస్తే చాలు… వెళుతూ వెళుతూ వెనుతిరిగి
అదో లాంటి తేనల బాణం… దిగదా ఎదలోకి
నువ్వు నడిచే దారులలొ… పూల గంధాలె ఊపిరిగా
కధ నడిచే మనసు కదే… హాయి రాగాల ఆమనిగా
దినమొక రకముగ… పెరిగిన సరదా
నినువిడి మనగలదా..!!
నిలవదే మది నిలవదే… సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే… తొలివలపున తడిసి
లలలాలా……..
ఎలా నీకు అందించాలో… ఎదలో కదిలే మధురిమలు
నేనే ప్రేమలేఖగ మారి… ఎదుటే నిలిచాను
చదువుకుని బదులిదని… చెప్పుకొలేవులే మనసా
పదములతో పనిపడనీ… మౌనమే ప్రేమ పరిభాషా
తెలుపక తెలిపిన వలపొక వరమని
కడలిగ అలలెగసా…
నిలవదే మది నిలవదే… సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే… తొలివలపున తడిసి
దేవదాసే కాళిదాసై… ఎంత పొగిడిన
కొంత మిగిలిపొయేంత… అందం నీది
3. Hailo Hailessare Song Lyrics
Hailo Hailessare song lyrics from Shatamanam Bhavati movie. The song lyrics are penned by Shree Mani while the music is provided by Mickey J Meyer and the song was sung by Aditya Iyengar, Rohith Paritala, Mohana Bhogaraju & Divya Divakar. Here you can find the Hailo Hailessare Mp3 song listen and download – Click here.
గొబ్బియల్లో గొబ్బియల్లో… కొండానయ్యకు గొబ్బిళ్లు
ఆదీలక్ష్మీ అలమేలమ్మకు… అందమైన గొబ్బిళ్లు
కన్నె పిల్లల కోర్కెలు తీర్చే… వెన్నాలయ్యకు గొబ్బిళ్లు
ఆ వెన్నాలయ్యకు గొబ్బిళ్ళో
ముద్దులగుమ్మ బంగరు బొమ్మ… రుక్మిణమ్మకు గొబ్బిళ్ళో
ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్లు
గొబ్బియల్లో గొబ్బియల్లో… కొండానయ్యకు గొబ్బిళ్లు
ఆదిలక్ష్మీ అలమేలమ్మకు… అందమైన గొబ్బిళ్లు
హైలో హైలెస్సారే… హరిదాసులు వచ్చారే
దోసిట రాసులు తేరే… కొప్పును నింపేయ్‍రే
డూ డూ బసవడు చూడే… వాకిట నిలుచున్నాడే
అల్లరి చేస్తున్నాడే… సందడి మొనగాడె
కొత్త అల్లుళ్ళ అజమాయిషీలే…బావ మరదళ్ల చిలిపి వేషాలే
కోడి పందాల పరవళ్ళే… తోడు పేకాట రాయుళ్ళే
వాడ వాడంతా… సరదాలై చిందులేసేలా
హే భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే
హే ధగ ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే
చక చక చక చక మకర్రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే
హే భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే
హే ధగ ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే
చక చక చక చక మకర్రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే
మూన్నాళ్ల సంబరమీఉత్సవమే… ఏడాది పాటంతా జ్ఞాపకమే
క్షణం తీరిక క్షణం అలసట… వశం కానీ ఉత్సాహమే
రైతు రారాజుల… రాతలే మారగా
పెట్టు పోతలతో… అందరికి చేయూతగా
మంచి తరుణాలకే… పంచ పరమాణ్ణమే
పంచి పెట్టేల… మనలోని మంచి తనమే
హే భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే
హే ధగ ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే
చక చక చక చక మకర్రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే
హే భగ భగ భగ భగ… గణ గణ గణ గణ
హే కణ కణ కణ కణ… తుర్రు తుర్ తుర్రు తుర్
హే భగ భగ భగ భగ… గణ గణ గణ గణ
హే ధగ ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే
రోకళ్ళు దంచేటి ధాన్యాలే… మనసుల్ని నింపేటి మాన్యాలే
స్వరం నిండుగా సంగీతాలుగా… సంతోషాలు మన సొంతమే
మట్టిలో పుట్టినా… పట్టు బంగారమే పెట్టి చేసారు
మన చిన్ని హృదయాలనే
సాన పెట్టేయిలా కోరుకుంటే… అలా నింగి తారల్ని
ఈ నేలలో పండించేలా
హే భగ భగ భగ భగ భోగిమంటలే… తుర్రు తుర్ తుర్రు తుర్
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే
హే ధగ ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే
హే భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే… తుర్రు తుర్ తుర్రు తుర్
హే ధగ ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే
నాలో నేను నీలో నేను నువ్వంటే నేను రా
నాతో నేను నీతో నేను నీవెంటే నేను రా
ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను
ఎంత ఎంత ముద్దొస్తున్నావో
ఎంత ఎంత అల్లేస్తున్నావో
నువ్విలా నాలో నుంచి నన్నే
మొత్తంగా తీసెసావు
చల్లగాలి చక్కలిగింతల్లో నువ్వే
చందమామ వెన్నెల కాంతుల్లో నువ్వే నువ్వే
రంగు రంగుల కుంచెల గీతం లో నువ్వే
రాగమైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే
అటు ఇటు ఎక్కడో నువ్వు ఎటు నిలిచినా
మనసుకు పక్కనే నిన్నిలా చూడనా
నీది ధ్యాసలో నను నేను మరిచిన
సంతోషంగా సర్లే అనుకొన్న ఎన్నాళ్లయినా
కళలుకిన్ని రంగులు పూసింది నువ్వే
వయసుకిన్ని మెలికలు నేర్పింది నువ్వే నువ్వే
నిన్న లేని సందడి తెచ్చింది నువ్వే
నన్ను నాకు కొత్తగా చూపింది నువ్వే నువ్వే
మనసుకు నీ కల అలవాటు అయ్యిలా
వదలిని ఓ క్షణం ఊపిరే తీయగా
నా నలువైపులా తియ్యని పిలుపుల
మైమరిపించే మెరుపులా సంగీతం
నీ నువ్వేగా
4. Sathamanam Bhavath
Shatamanam Bhavati Title Song Lyrics from Shatamanam Bhavati movie. The song was sung by Chitra, Vijay Yesudas. This song is composed by Mickey J. Meyer while the lyrics are penned by Ramajogayya Sastry. The movie stars Sharwanand, Anupama Parameswaran, Prakash Raj, and Jayasudha.
శతమానం భవతి
వదువేమో అలమేలు
వరుడట శ్రీవారు
మనువాడి కలిశారు
చెలిమి కలిమి ఒకరి కొకరు
ఈ జంటను దీవించగ
దేవతలందరి నోట
పలికెను చల్లని మాట
శతమానం భవతి (X4)
మీసకట్టు కుంకుమ బొట్టు
కంచి పట్టు పంచె కట్టు
అల్లుకుంది అనుబంధము
మమతలు ముడివేస్తూ
తను కధ తాళి బొట్టు
ఆమె తన ఆయువు పట్టు
ఏకమైంది దాంపత్యము
ఏడడుగులు వేస్తూ
నాలో సగం నీవంటూ
నీలో సగం నేనంటూ
జనుమలు జతపడు వలపుగ
ఇరుమనసుల కొక తలపుగ
కలగలిసిన ఒక తనువుకు
శతమానం భవతి (X2)
అందగాడు అందరివాడు
అందుబాటు బంధువు వీడు
రేవు పక్క రేపల్లెకు
నచ్చిన చెలికాడు
పంచదార నవ్వుల వాడు
పాతికేళ్ల పండుగ వీడు
తాతయ్యకు నానమ్మకు
నమ్మిన చేదోడు
ఉగ్గుపాలే గోదారై
ఊపిరి గాలే గోదారై
గల గల పరుగుల కలలుగా
అలలెగసిన తన వయసుకు
నలుపెరుగని పసి మనసుకు
శతమానం భవతి (X4)