Nallamala Movie Mp3 Songs – Watch and Download

0

Nallamala Movie Mp3 Songs

Nallamala Movie Mp3 Songs

Nallamala is an action drama movie directed by Ravi Charan. The movie casts Amit Tiwari and Bhanu Sri are in the lead roles along with Nassar, Tanikella Bharani, Ajay Ghosh, Kalakeya Prabhakar, and many others are seen in supporting roles. The music was composed by Peddapaalli Rohit while cinematography is done by Venu Muralidhar and is edited by Shiva Sarvani. The film is produced by R Murali under Namo Creations banner. Here in this article you can search for the details about the Nallamala Movie Mp3 Songs.

1. Yemunnave Pilla Song Lyrics in Telugu

Yemunnave Pilla Song Lyrics penned & music score provided by PR and sung by Sid Sriram from the Telugu cinema Nallamalla. The music was composed by Peddapaalli Rohit while cinematography is done by Venu Muralidhar and is edited by Shiva Sarvani. The film is produced by R Murali under Namo Creations banner.

లేత లేగదూడ పిల్ల తాగే
పొదుగులోని పాల రంగు నువ్వే
పచ్చ పైరు ఓని ఒంటికేసుకొని ఏమున్నవే
నింగి సాటుకున్న సినుకు నువ్వే
సూటిగా దూకేసి తాకినావే
ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నవే
ఓ… మల్లెపూలన్నీ కుళ్ళుకునేలా
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
తేనెటీగలన్నీ సుట్టుముట్టేలా
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
సూరీడు సూడు పొద్దు దాటినా నిన్ను సూసి పోలేడే
సీకటి ధాటినా సెందురుడు… దాగే లాగా ఏమున్నవే

ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
సూపుల్తో సంపేశావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
మాటల్లో ముంచేశావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

ఓ… తొలి సినుకు సేరి
ఈ నేల గాలి గుప్పించే… మట్టి సువాసన నీది
పొత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే… పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది
నువ్వు నడిసే నడకల్లో… నది పొంగుల హంగుంది
లేత నడుము మడతల్లో.. ఈ మాయల మనసుంది
వాలే రెండు కన్నుల్లో… బోలెడంత సిగ్గు దాగుంది
వాలుజడ గుత్తుల్లో… ఈ భూగోళం మొత్తముంది

హే..! ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
సూపుల్తో సంపేశావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
మాటల్లో ముంచేశావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

ఓ… ఎగిరేటి సిలకా గోరింక వంక… ఓరా కన్నేసి సూసింది సూడు
తరిగేటి సొగసా కాదేమో బహుశా… అయినా నవ్వేసి వచ్చింది నేడు
కారుమబ్బు సీకట్లో నీ వెన్నెల నవ్వుంది
ఆరుబయట వాకిట్లో… ఆ సుక్కల ముగ్గుంది
జంట అయ్యే దారుల్లో నీ సిగ్గుల అడ్డుంది
వెంటవచ్చే అడుగుల్లో జన్మజన్మల తోడుంది

ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
సూపుల్తో సంపేశావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
మాటల్లో ముంచేశావే
ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

2. Nallamala Title Song Lyrics in Telugu

Nallamala Title Song Lyrics and this Song Music was Composed by PR sung by Ashwini chepuri – Haripriya M – Arun Kaundinya-Sampath G.Nallamala Title Song Lyrics Written by PR Nallamala Movie Lyrics

ఎరుపెక్కిన గగనమిది

రవికెరుగని గ్రహణం

ఎదురొచ్చే శకలాలని

పెకలించే పర్వం

ఎరుపెక్కిన గగనమిది

రవికెరుగని గ్రహణం

ఎదురొచ్చే శకలాలని

పెకలించే పర్వం

నిజాల చాటు నీలి నీడని

సవాలు చేసే సమిదలమ్మనీ

యుగాలనాటి క్రూర కథలని

సమాధి చేసే సత్తువుందనీ

ఇది దారి చూపే సూర్యుడికి

జాలి లేని రాబందుకి

జరుగుతున్న ఆకాశ యుద్ధం

కవాతు చేసే కష్టానికి

రగులుతున్న రక్తానికి

రంగులద్దుకున్న సేన సిద్ధం

నల్లమలా నల్లమలా నల్లమలా నల్లమలా

నల్లమలా నల్లమలా నల్లమలా నల్లమలా

3. Pada Pada Padara song lyrics in Telugu

Latest Telugu movie Nallamalla song Pada pada padara lyrics in Telugu. This song’s lyrics are written by the P.R. Music given by the P R and this song is sung by the singer Sripada Chinmayi. Music is labeled by the Madhura Audio. Amit Tiwari Nassar and Bhanu Sri plays lead roles in this movie. Nallamalla movie is directed by the Ravichandran.

సాగే దారే ఎందాకైనా తోడుంటా
నీతో చేరేనే నీ వెనకే అడుగేస్తా
నిన్నే కోరి వెచ్చేసాను నీవెంటా
నీడై పోను నువ్వు పొమ్మన్న నేనుంటా
నా ఈ ప్రాణాలు నీకే
ఈ జన్మ అయినా నీ తోడే
పద పద పదరా పడుచు పరదా
బదులు తెలుపదా వీరా

పద పద పదరా చిలిపి కథరా
చిరు తగువును చెయ్యరా
పద పద పదరా పడుచు పరదా
బదులు తెలుపదా వీరా
పద పద పదరా చిలిపి కథరా
చిరు తగువును చెయ్యరా

హే దూకే దాటలేక పరువాన్ని
రా ఇదిగో నీదే ఈ అలివేడి
సిగ్గు మబ్బు ఓ దాచేయ్
చీకటి సిగలో ఓ జాజై
నీ కోసమే నా ఆకాశమే
చుక్కల రేఖ ఆజారే చక్కని లోకం ముంచేరె
చూపుల్తో ఊపిరి సిగ పెంచావే
నా ప్రాణాలు నీకెనే
ఏ జన్మ అయినా నీ తోడే

పద పద పదరా పడుచు పరదా
బదులు తెలుపదా వీరా
పద పద పదరా చిలిపి కథరా
చిరు తగువును చెయ్యరా
పద పద పదరా పడుచు పరదా
బదులు తెలుపదా వీరా
పద పద పదరా చిలిపి కథరా
చిరు తగువును చెయ్యరా

Also Read: Etharkkum Thunindhavan Movie Mp3 Songs 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *