Thellavarithe Guruvaram Movie Mp3 Songs – Mellaga Mellaga, Manasuki Hanikaram Ammaye, Are Em Ayyindho Emo

0

Thellavarithe Guruvaram Movie Mp3 Songs

Listen and Download Thellavarithe Guruvaram Movie Mp3 Songs

Thellavarithe Guruvaram is a comedy romantic movie directed by Manikanth Gelli. This movie was produced by Rajani Korrapati and Ravindra Benerjee Muppaneni under the banners of Vaaraahi Chalana Chitram and Loukya Entertainments.  The movie starring Sri Simha, Chitra Shukla, and Misha Narang. The movie music is given by Kaala Bhairava. Below in this article,  you can get Thellavarithe Guruvaram Movie Mp3 Songs.

1. Mellaga Mellaga Dhaarule Marena Song Lyrics

Mellaga Mellaga Dhaarule Marena Song Lyrics penned by Raghuram, music score provided by Kaala Bhairava, and sung by Kaala Bhairava & Sahithi Chaganti from the Telugu film Thellavarithe Guruvaram.

మెల్లగా మెల్లగా దారులే మారెనా
కొత్తగా కొత్తగా పయనమే చూపెనా
నిన్నటి ఆశే మాని… రేపటి ఊసే లేని
ఆ క్షణమే ఎదురైందా
రమ్మని పిలిచిందా… చీకటి నీడను దాటి
వేకువ వాకిలిలోకి… ఊహలతో ఎగిరిందా
ఇంతలో మనసిలా

అరెరే ఉన్నట్టుండి… చల్లని గాలై చేరిందే
ఏదో స్నేహం ఇలా… కంగారే తగ్గించి
కాలక్షేపం చేసిందే… శ్వాసై మారేట్టుగా
ఓఓ..! ఉన్నట్టుండి… చల్లని గాలై చేరిందే
ఏదో స్నేహం ఇలా… కంగారే తగ్గించి
కాలక్షేపం చేసిందే… శ్వాసై మారేట్టుగా

మెల్లగా మెల్లగా దారులే మారెనా
కొత్తగా కొత్తగా పయనమే చూపెనా
ఓ ఓ ఓఓ ఓ

ఎలా గతమొక క్షణములో మాయం
జతై ముడిపడమన్నది ప్రాణం
కథే మలుపులు చూపిన వైనం
ఒకే అలుపెరగని ఆరాటం
ఎలా మనసుతో ముందడుగేయడం
మెల్లగా మెల్లగా దారులే మారెనా
కొత్తగా కొత్తగా పయనమే చూపెనా

అరెరే ఉన్నట్టుండి… చల్లని గాలై చేరిందే
ఏదో స్నేహం ఇలా… కంగారే తగ్గించి
కాలక్షేపం చేసిందే… శ్వాసై మారేట్టుగా
ఓఓ..! ఉన్నట్టుండి… చల్లని గాలై చేరిందే
ఏదో స్నేహం ఇలా… కంగారే తగ్గించి
కాలక్షేపం చేసిందే… శ్వాసై మారేట్టుగా
ఆఆ… గతమొక క్షణములో మాయం

2. Manasuki Hanikaram Ammaye Song Lyrics 

Manasuki Hanikaram Ammaye Song Lyrics  from Thellavarithe Guruvaram movie. The lyrics are penned by Krishna Vallepu and music composed by Kaala Bhairava and sung by Achu Rajamani, Prudhvi Chandra & Kaala Bhairava. The movie stars Sri Simha, Chitra Shukla, and Misha Narang.

మనసుకు హానికరం అమ్మాయే
తెలిసిన తప్పుకోడు అబ్బాయే
వదలలేం ఉండలేం… కదలలేం ఆగలేం
వదలలేం ఉండలేం… కదలలేం ఆగలేం

సరే సరే అన్నామో రాదారే
నహి నహి అన్నామో గోదారే

ఆడాళ్ళతో అంతేరా మామ
అర్ధం కాని ఫజిలేరా మామ
చేసేదంతా చేస్తూనే మామ
చూపిస్తారు సినిమాను మామ

వదలలేం ఉండలేం… కదలలేం ఆగలేం ||4||

తెలివిగా పులిహోరే కలిపేస్తాం
చివరకి కరేపాకులైపోతాం
కక్కలేం మింగలేం… చెప్పలేం దాచలేం
కక్కలేం మింగలేం… చెప్పలేం దాచలేం
విడుదల ఉండని ఖైదీలం
మగువల చేతిలో బంధీలం

మీరే మీరే ప్రాణం అంటారే
రోజు రోజు ప్రాణం తింటారే
అంతా నువ్వే అంటూ ఉంటారే
అంతే చూసి జంపైపోతారే

కక్కలేం మింగలేం… చెప్పలేం దాచలేం ||4||

తగువుకి కత్తులే దూస్తారే
తప్పులన్ని మాపైనే తోస్తారే
నెగ్గలేం తగ్గలేం… బతకలేం చావలేం
నెగ్గలేం తగ్గలేం… బతకలేం చావలేం

లేనిపోని డౌటే రాజేస్తారే
నిజమని ఫైటే చేసేస్తారే
ఎట్టా ఉన్నా తంటాలే కాక
ఆడేస్తారు మనతోటి పేక
ఆర్గ్యు వీలంటూ లేక
మూగై పోతే బతుకంతా కేక

నెగ్గలేం తగ్గలేం… బతకలేం చావలేం
నెగ్గలేం తగ్గలేం… బతకలేం చావలేం
నెగ్గలేం తగ్గలేం… బతకలేం చావలేం
నెగ్గలేం తగ్గలేం… బతకలేం చావలేం

3. Are Em Ayyindho Emo Song Lyrics 

Are Em Ayyindho Emo Song Lyrics  from Thellavarithe Guruvaram. The movie starring Sri Simha, Chitra Shukla, and Misha Narang.   The song lyrics are penned by Kittu Vissapragada and music composed & sung by Kaala Bhairava. Here you can find the Are Em Ayyindho Emo MP3 song listen and download – Click here.

అరె ఏమయ్యిందో ఏమో… అరె ఏమయ్యిందో ఏమో
అరె ఎవరే ఎవరే పిల్లా… నీ చేయి పడుతుంటే ఇల్లా
నా పల్సే పెరిగే ఎల్లా… ఓ ఓ ఓ ఓ ఓ
మజ్ను లేని లైలా… మనసంతా మొదలైంది గోల
ఓ మందే ఇస్తే పోలా… ఓ ఓ ఓ ఓ ఓ
ఏవో కలలే కన్నా… నీతో నిజమనుకున్నా రోజూ
మాటే తడబడుతుంటే… భాషే పగబడుతోందే నాపై

అరె ఏమయ్యిందో ఏమో… ఈ చూపు తాకిన ఈ నిమిషం
అరె ఏమయ్యిందో ఏమో… తలకిందులయ్యెనే నా లోకం
అరె ఏమయ్యిందో ఏమో… ఇన్నాళ్ళు తెలియదే ఈ మైకం
అరె ఏమయ్యిందో ఏమో… అరె చేతవాలెనే ఆ స్వర్గం
ఏవో కలలే కన్నా… నీతో నిజమనుకున్నా రోజూ
మాటే తడబడుతుంటే… భాషే పగబడుతోందే నాపై

తా రే… నాతో నువ్వుంటే గడియారమే… పరుగే పెడుతున్నదే, ఓఓ
నీతో నే లేని నిమిషాలకే… నడకే రాకున్నదే
అరె ఏమయ్యిందో ఏమో… పొగడాలి అంటే నీ అందాన్ని
అరె ఏమయ్యిందో ఏమో… వెతకాలి కొత్తగా పోలికని
అరె ఏమయ్యిందో ఏమో… దారాన్ని కట్టి ఆ వేగాన్ని
అరె ఏమయ్యిందో ఏమో… నీపైన కురిపిస్త ఆ వర్షాన్ని
ఏవో కలలే కన్నా… నీతో నిజమనుకున్నా రోజూ
మాటే తడబడుతుంటే… భాషే పగబడుతోందే నాపై

అరె ఎవరే ఎవరే పిల్లా… నీ చేయి పడుతుంటే ఇల్లా
నా పల్సే పెరిగే ఎల్లా… ఓ ఓ ఓ ఓ
మజ్ను లేని లైలా… మనసంతా మొదలైంది గోల
ఓ మందే ఇస్తే పోలా… ఓ ఓ ఓ ఓ
ఏవో కలలే కన్నా… నీతో నిజమనుకున్నా రోజూ
మాటే తడబడుతుంటే… భాషే పగబడుతోందే నాపై

Also, Read: Listen and Download – Anugraheethan Antony Movie Mp3 Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *