Listen and Download – Vakeel Saab Movie MP3 Songs
Vakeel Saab legal drama movie. This movie is written and directed by Venu Sriram and produced by Dil Raju and Sirish under Sri Venkateswara Creations in association with Bayview Projects. This movie is a remake of the 2016 Hindi movie Pink. The movie starring Pawan Kalyan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla, Prakash Raj, and Shruthi Haasan. S. Thaman composed the beautiful music from this movie. Below in this article, you can find Vakeel Saab Movie MP3 Songs.
1. Maguva Female Version song Lyrics
Maguva Female Version song Lyrics from Vakeel Saab movie. The movie starring Pawan Kalyan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla, Prakash Raj, and Shruthi Haasan. The song lyrics are penned by Ramajogayya Sastry. The music composed by Thaman S and the song was sung by Mohana Bhogaraju.
ఆకాశం తాకే నీ ఆక్రందనలు
మనసారా వినువారెవరూ
నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు
సవరించే మనవారెవరూ
కళమారుతున్న జీవితం… కలతలోకి జారెనా
కలలుగన్న కలలకు… నీటి చెమ్మ తగిలెనా
వెలుతురైన ప్రతిదినం… చూపుతోందా వేదనా
అందమైన బతుకునా అలజడి చలరేగెనా
ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం
చీకటి ముసిరిందె చిటికెల్లోనా
తీరదు నీ శోకం… మారదు ఈ లోకం
తరములు ఎన్నైనా… నీ కథ ఇంతేనా
మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా
మగువా మగువా నీ తలరాతలొ చిరునవ్వులు కలవా
అలుసుగ చూస్తారు… లోకువ చేస్తారు
అనాది కాలంగా అబలవే నువ్వూ
నిందలు వేస్తారు నిను వెలివేస్తారు
ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు
మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా
నీ మనసుకు లేదా ఏ విలువా
మగువా మగువా నీ తలరాతలొ చిరునవ్వులు కలవా
నీ తలరాతలొ చిరునవ్వులు కలవా
2. Sathyameva Jayathe Song Lyrics
Sathyameva Jayathe Song Lyrics are penned by Ramajogayya Sastry and music is given by Thaman S. The song was sung by Shankar Mahadevan, Prithvi Chandra & Thaman S from the Power Star Pawan Kalyan’s Vakeel Saab movie. The movie starring Pawan Kalyan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla, Prakash Raj, and Shruthi Haasan.
జన జన జన జనగణమున… కలగలిసిన జనం మనిషిరా
మన మన మన మనతరపున… నిలబడగల నిజం మనిషిరా
నిశి ముసిరిన కలలను తన వెలుగుతో… గెలిపించు ఘనుడురా
పడి నలిగిన బతుకులకొక… బలమగు భుజమివ్వగలడురా
వదలనే వదలడు… ఎదురుగా తప్పు జరిగితే
ఇతనిలా ఓ గళం మన వెన్నుదన్నై పోరాడితే
సత్యమేవ జయతే… సత్యమేవ జయతే
సత్యమేవ జయతే… సత్యమేవ జయతే
జన జన జన జనగణమున… కలగలిసిన జనం మనిషిరా
మన మన మన మనతరపున… నిలబడగల నిజం మనిషిరా
నిశి ముసిరిన కలలను తన వెలుగుతో… గెలిపించు ఘనుడురా
పడి నలిగిన బతుకులకొక… బలమగు భుజమివ్వగలడురా
గుండెతో స్పందిస్తాడు… అండగా చెయ్యందిస్తాడు
ఇలా చెంప జారెడి… ఆఖరి అశ్రువునాపెడివరకు
అనునిత్యం బలహీనులందరి ఉమ్మడి గొంతుగ
పోరాటమే తన కర్తవ్యం
వకాల్తా పుచ్చుకుని వాదించే ఈ వకీలు
పేదోళ్ళ పక్కనుండి కట్టిస్తాడు బాకీలు
బెత్తంలా చుర్రుమని కక్కిస్తాడు నిజాలు
మొత్తంగా న్యాయానికి పెట్టిస్తాడు దండాలు
ఇట్టాంటి ఒక్కడుంటే అంతే చాలంతే
గొంతెత్తి ప్రశించాడో అంతా నిశ్చింతే
ఇట్టాంటి అన్యాయాలు తలెత్తవంతే
మోరెత్తే మోసగాళ్ళ పత్తా గల్లంతే
3. Kanit Papa Kanti Papa Song Lyrics Song
Kanti Papa Kanti Papa Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Thaman S, and sung by Armaan Malik from the Vakeel Saab movie. The movie actors Pawan Kalyan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla, Prakash Raj, and Shruthi Haasan.
కంటిపాపా కంటిపాపా… చెప్పనైన లేదే
నువ్వంతలా అలా… ఎన్ని కలలు కన్నా
కాలి మువ్వా కాలి మువ్వా… సవ్వడైనా లేదే
నువ్విన్నినాళ్ళుగా వెంట తిరుగుతున్నా
నీరాక ఏరువాక… నీ చూపే ప్రేమలేఖ
నీలో నువ్వాగిపోకా… కలిసావే కాంతి రేఖ
అంతులేని ప్రేమ నువ్వై … ఇంత దూరం వచ్చినాక
అందమైనా భారమంతా… నాకు పంచినాకా
మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు
కంటిపాపా కంటిపాపా… చెప్పనైన లేదే
నువ్వంతలా అలా… ఎన్ని కలలు కన్నా
సాపమాప మాప మాగసామగరిసా
సాపమాప మాప మాగసామగరిసా
సుదతీ సుమలోచినీ సుమనోహర హాసిని
రమణీ ప్రియ భాషిణీ కరుణాగున భాసిని
మనసైన వాడిని మనువాడిన ఆమని
బదులీయవే చెలీ నువు పొందిన ప్రేమనీ
పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా
సాపమాప మాప మాగసామగరిసా
సాపమాప మాప మాగసామగరిసా
ఎదలో ఏకాంతము… ఏమయ్యిందో ఏమిటో
ఇదిగో నీ రాకతో… వెళిపోయింది ఎటో
నాలో మరో నన్ను చూశా… నీకో స్నేహితుణ్ని చేశా
కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాసా
ఆకాశం గొడుగు నీడ… పుడమేగా పూల మేడ
ఏ చూపులు వాలకుండా… ప్రేమే మన కోటగోడ
నాకు నువ్వై నీకు నేనై… ఏ క్షణాన్ని వదలకుండా
గురుతులెన్నో పెంచుకుందాం… గుండె చోటు నిండా
మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు ||2||
4.Kadhulu Kadhulu Song Lyrics
Kadhulu Kadhulu Song was sung by Hemachandra & Sri Krishna from the Vakeel Saab movie. The movie features Pawan Kalyan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla, Prakash Raj, and Shruthi Haasan. The song lyrics are written by Suddala Ashok Teja and music composed by Thaman S.
కదులు కదులు కదులు… కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు… బానిస సంకెళ్ళను వదులు
కాలం తన కళ్ళు తెరిచి… గాలిస్తున్నది నీలో
కాళిక ఏమైందని ఉగ్రజ్వాలిక ఏమైందని
దెబ్బకొడితే పులిని నేను ఆడదాన్ననుకున్నా
తోక తొక్కితే నాగు తనను ఆడదనుకుంటుందా
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
కదులు కదులు కదులు… కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు… బానిస సంకెళ్ళను వదులు
గాజుతో గాయాలు చెయ్
చున్నీనే ఉరి తాడు చెయ్
రంగులు పెట్టే గొల్లనే గుచ్చే బాకులు చెయ్
పిరికితనం ఆవహించి పరిగెత్తే నీ కాళ్ళతో
రెండు తొడల మధ్య తన్ని… నరకం పరిచయం చెయ్
నీ శరీరమే నీకూ ఆయుధ కర్మాగారం
బతుకు సమర భూమిలో నీకు నీవే సైన్యం… సైన్యం సైన్యం
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
కదులు కదులు కదులు… కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు… బానిస సంకెళ్ళను వదులు
5. Maguva Maguva Song Lyrics
Maguva Maguva Song Lyrics from Pawan Kalyan’s Vakeel Saab movie. The Song lyrics out on 8th March 2020 at 10 AM. The song was sung by Sid Sriram. and lyrics penned by Ramajogayya Sastry while music composed by Thaman S. The movie stars
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…
అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా..
పరుగులు తీస్తావు ఇంటా బయట..
అలుపని రవ్వంతా అననే అనవంటా..
వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా..
సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స
గ..మ..ప..మ..గ.. గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స..
సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స
గ..మ..ప..మ..గ.. గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స..
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…
నీ కాటుక కనులు విప్పారకపోతే.. ఈ భూమికి తెలవారదుగా..
నీ గాజుల చేయి కదలాడకపోతే.. ఏ మనుగడ కొనసాగదుగా…
ప్రతి వరుసలోను ప్రేమగా..
అల్లుకున్న బంధమా.. అంతులేని నీ శ్రమ అంచనాలకందునా
ఆలయాలు కోరనీ.. ఆదిశక్తి రూపమా..
నీవు లేని జగతిలో దీపమే వెలుగునా..
నీదగు లాలనలో, ప్రియమగు పాలనలో..
ప్రతి ఒక మగవాడు పసివాడేగా..
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా..
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా…
సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స
గ..మ..ప..మ..గ.. గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స..
సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స
గ..మ..ప..మ..గ.. గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స..
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…